శభాష్.. సుకుమార్..

144

మనం సంపాదించిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి తిరిగి ఇస్తే ఆ సంతోషమే వేరు కదా.. ఇందుకు సంబంధించిన అనేక చిత్రాలను మనం చూశాం. కానీ, దీన్ని వాస్తవంలో చేసి చూపిస్తున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఆయన కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధప్రదేశ్ లోని కాకినాడకు చేరువలో గల రాజోలులో DOCS80 ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here