వరద బాధితులకు టాలీవుడ్ సాయం

49
Tollywood Heros donations for Cm relief Fund
Tollywood Heros donations for Cm relief Fund

Tollywood Heros donations for Cm relief Fund

భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు హీరోలు మెరుపులా స్పందించారు. గతంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందుకొచ్చిన తెలుగు హీరోలు మరోసారి మానవతను చాటుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రతిఒక్కరికి అండగా ఉంటామనే భరోసానిచ్చారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చిరంజీవి, మహేశ్‌బాబు ఒక్కొ కోటి రూపాయలను సాయం చేశారు. నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్‌ రూ.50 లక్షలు, హీరో రామ్ రూ.25 లక్షల సాయాన్ని ప్రకటించారు. హీరో విజయ్‌ దేవరకొండ పది లక్షలు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా ఐదు లక్షల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ బండ్ల గణేష్ కూడా తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. కొందరు సెలబ్రిటీలు ముంపు ప్రాంతాలను విజిట్ చేసి చేతనైనా సాయం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here