కుర్ర హీరోలే టార్గెట్ గా వెళుతోన్న ప్రొడ్యూసర్

రాబోయే రోజుల్లో యంగ్ హీరోలదే రాజ్యం.. పెద్ద స్టార్ హీరోలుండగా వీరిది ఇండస్ట్రీ ఎలా అవుతుందీ అనుకుంటున్నారేమో. కానీ అదే నిజం. ఎందుకంటే.. ఇప్పుడు వెటరన్ హీరోలు యేడాదికో సినిమా చేస్తారు. అలాగే టాప్ సిక్స్ లో ఉన్న స్టార్స్ .. కూడా అంతే. మరి ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే పరిశ్రమ మనుగడ సాగించాలంటే కావాల్సింది యంగ్ హీరోలే కదా. అందుకే వారిదే రాజ్యం అంటున్నది. ఒకవేళ ఎవరికైనా అదృష్టం హిట్ సినిమా కథలా అతుక్కుంటే వీరి రేంజ్ కూడా మారిపోతుంది. అది గమనించే కొత్తగా  ఫైనాన్సియర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న ఏసియన్ గ్రూప్ నిర్మాణం రంగంలోకి వచ్చింది. పైగా వీరికి స్టార్ హీరోలు ఇప్పుడు వెంటనే డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినా.. అంత పెద్ద బడ్జెట్స్ తో పందేరాలకు సిద్ధంగా లేరు. అందుకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న ‘లవ్ స్టోరీ’మూవీతో నిర్మాణం మొదలుపెట్టిందీ సంస్థ. అయితే ఆ సినిమా రిజల్ట్ వచ్చేంత వరకూ వెయిట్ చేయడం లేదు. వరుసగా యంగ్ హీరోల డేట్స్ ను లాక్ చేస్తూ అందరికీ అడ్వాన్స్ లు ఇస్తోంది. పైగా వీటికి దర్శకులు, కథ అంటూ కూడా అప్పుడే హడావిడీ చేయడం లేదు. జస్ట్ కుర్రాళ్లను లాక్ చేస్తున్నారంతే. నాగచైతన్య తర్వాత రీసెంట్ గా నిఖిల్ హీరోగా ఏసియన్ బ్యానర్ సినిమా అనౌన్స్ చేసింది.

అతని కెరీర్ లోనే కాస్త పెద్ద బడ్జెట్ పెడతాం అంటున్నారు. బట్ ఈ మూవీకి దర్శకుడు ఎవరనేది చెప్పలేదు. ఇక లేటెస్ట్ గా శర్వానంద్ హీరోగా మరో సినిమా అనౌన్స్ చేశారు. ఇదీ అంతే. దర్శకుడు ఇతర వివరాలేమీ తెలియదు. చెప్పలేదు కూడా. మొత్తంగా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నది ఏంటంటే.. ఈ బ్యానర్ లో వరుసగా శేఖర్ కమ్ములతోనే సినిమాలు చేస్తారని. అంటే హారిక హాసినిలో త్రివిక్రమ్ లాగా అన్నమాట. అదే నిజమైతే.. తర్వాత శేఖర్ కమ్ముల నిఖిల్ తోనూ, శర్వానంద్ తోనూ సినిమాలు చేస్తాడనుకోవచ్చు. బట్.. ఏసియన్ గ్రూప్ కీలకంగా ఉన్నా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రాలకు నారాయణదాస్ నారంగ్, రామ్ మనోహర్ పుష్కర్ లు నిర్మాతలన్నమాట. చూద్దాం.. మరి ఈ యంగ్ స్టర్స్ వేట ఇంకా ఎంతమంది హీరోల వరకూ ఉంటుందో..?

tollywood news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article