Tollywood Will Accept Prakash Raj After Sareleru
ప్రకాష్ రాజ్.. డౌటే లేకుండా ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకడు. ఏ పాత్రైనా చేయగల దమ్మున్న అతికొద్దిమంది నటుల్లో ఒకడు. కొన్నాళ్ల క్రితం రకరకాల కాంట్రవర్శీస్ తో టాలీవుడ్ కు దూరమయ్యాడు. మధ్యలో పాలిటిక్స్ లోకీ ఎంటర్ అయ్యాడు. ఏకంగా ఒంటరిగా మోడీ, అమిత్ షాలపై డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ.. వారిని ఓ రేంజ్ లో విమర్శించే ఏకైక నటుడుగానూ సత్తా చాటాడు. అటుపై కర్ణాటకలోని బెంగళూరు నుంచి పార్లమెంట్ బరిలో నిలిచి ఓడిపోయాడు. అప్పుడంతా ఇవిఎమ్ ల మహిమ అన్నారు. మొత్తంగా ఇక ఇప్పుడు మళ్లీ నటుడుగా బిజీ కావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో తనకు బాగా కలిసొచ్చిన టాలీవుడ్ నే ఎంచుకున్నాడు.
తన రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలంటే.. మళ్లీ పెద్ద స్టార్ తో అయితేనే బావుంటుందని.. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబును ఒప్పించి మరీ సరిలేరు నీకెవ్వరులో నటించాడు. నిజానికి ఈ పాత్రకు ముందుగా జగపతిబాబును తీసుకున్నారు. కానీ ప్రకష్ పోరు భరించలేక మహేష్ దర్శకుడితో చెప్పించి జగ్గూభాయ్ ని తప్పించాడు. కట్ చేస్తే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు ప్రత్యేకంగా వచ్చిన గుర్తింపేమీ లేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మోనార్క్ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు కాస్ట్ లీ నటుడు కూడా కావడంతో మరే దర్శకుడు, నిర్మాతా అతన్ని ప్రిఫర్ చేయడం లేదట. అంతేకాక.. ప్రకాష్ రాజ్ ను ఇప్పటికే ఎన్నో వేరియేషన్స్ లో చూశారు. కాబట్టి కొత్తగా ఏం ఉండదు అనే భావన కూడా ఉంది.
ప్రస్తుతం తనూ నిర్మాణ భాగస్వామిగా ఉండి.. కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘రంగమార్తాండ’సినిమా చేస్తున్నాడు. మరాఠీలో బ్లాక్ బస్టర్ అయిన నటసామ్రాట్ కు రీమేక్ ఇది. ఈ మూవీ తర్వాత ప్రకాష్ రాజ్ తెలుగులో ఏం చేస్తున్నాడు అనేది ప్రస్తుతానికి క్లూ లెస్. అంటే ఇకపై ఈ నటుడు తెలుగులో గతం కాబోతున్నాడా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.