ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాపం తెలిపేందుకు గాను సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది. కాగా ఈనెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 21వ తేదీ వరకు కొనసాగాయి. మధ్యలో కొన్ని రోజులకు సమావేశాలు జరగలేదు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు కీలక చర్చలపై చర్చ జరిగింది. అంతేకాకుండా పలు బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే..