రేపు ఏపీలో బంద్ కు ఏబీవీపీ పిలుపు

tomorrow bandh in andhra pradesh

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలనీ, విద్యా హక్కు చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలిపింది. 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాము బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచే దిశగా ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనీ, ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేదలకు కేటాయించేలా చూడాలన్నారు. ఏపీలో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article