హుజూర్ నగర్ లో టఫ్ ఫైట్

Tough fight in Huzur Nagar

హుజుర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రసవత్తరంగా మారింది. . టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఆ పార్టీల అభ్యర్థులకు తోడుగా క్యాడర్, లీడర్లంతా మకాం వేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు . గెలుపు మాదంటే మాదంటూ ప్రతి సవాళ్లు విసురుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ పోరులో నల్గొండ ఎంపీగా బరిలోకి దిగి మళ్లీ విజయం సాధించారు. అయితే ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్‌నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో నిలిచారు.ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన స్థానం . సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ సర్వ శక్తులను ఒడ్డుతుంది.
హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పురుషులు, మహిళల ఓట్లు చెరో లక్షకు పైగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ కనిపిస్తున్నా ఇండిపెండెంట్లతో ఆ రెండు పార్టీలకు ముప్పు పొంచి ఉందనే వాదనలు లేకపోలేదు. గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు పోటీ చేసి దాదాపు 10 వేల ఓట్లు సాధించారు. అందులో ఒక్క అభ్యర్థికే 5 వేల ఓట్లు పడటం విశేషం.ఈసారి కూడా హుజుర్‌నగర్‌లో ఇండిపెండెంట్ల హవా కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఎన్నికల బరిలోకి దిగారు. ప్రచారంలో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకెళుతున్నారు. మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సై అనడంతో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. దాంతో ఈసారి కూడా ఇండిపెండెంట్ల బెడద ప్రధాన పార్టీలకు  తప్పేలా లేదు.  ఎందుకంటే ఎవరు గెలిచినా దాదాపు తక్కువ మెజార్టీతో బయటపడతారనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించినా.. కేవలం వేయి, రెండు వేల ఓట్ల తేడాతో బయటపడే ఛాన్స్ కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగానీ వేలకు వేల ఓట్లు సాధించి బంపర్ మెజార్టీ అంటూ ఏమి ఉండకపోవచ్చనేది కొందరి మాట.

tags : huzur nagar , by poll , trs, congress, independents, mejority,

మరో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్

నల్లారిని మించుతున్నకేసీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *