రేవంత్ రెడ్డి హౌజ్‌ అరెస్టు

171
TPCC Chief Revanth Reddy Police House Arrest
TPCC Chief Revanth Reddy Police House Arrest

ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఆయ‌న పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొకపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్టు రేవంత్ రెడ్డి ఆరోపించిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం పార్లమెంట్ లో కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

  • రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయ‌డం నియంతృత్వానికి పరాకాష్ట టీపీసీసీ నేత మల్లు రవి విమ‌ర్శించారు. పార్లమెంట్ లో కొకపేట అవినీతిని ఎండగడుతాడానే భయంతోనే పోలీసులు ఇలా అడ్డుకుంటున్నార‌ని విమర్శించారు. ఇది అప్రజాస్వామికం అని ఇంత దుర్మర్గం ఎక్కడా చూడలేదన్నారు. ఈ నియంత, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతార‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here