భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో విషాదం. సరదాగా స్నేహితులతో ఈత కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు.భద్రాద్రి జిల్లాపాల్వంచ కరకవాగు వద్ద కిన్నెరసాని కాలువలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతు..కొత్తగూడెం లోని లక్ష్మిదేవిపల్లి చెందిన ముగ్గురు యువకులు కరక వాగులో ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది.సోయల్ పాషా( 18సం”) అనిల్ కుమార్ (16సం”) ఇద్దరు యువకుల మృతి చెందగా మరొక యువకుడు హమీద్ ను కాపాడిన స్థానికులు.. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న పాల్వంచ పట్టణ పోలీసులు మరియు రిస్క్ టీం మృతదేహాన్ని వెలికి తీశారు.. కరకవాగు లో నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం. ఈత రాకుండా కాలవలో దిగటం ఒకరిని కాపాడబోయి మరొకరు మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article