టీవీ ప్రేక్షకులకు స్వల్ప ఊరట

TRAI EXTEND CHANNEL SELECTION

ఛానళ్ల ఎంపికలో టీవీ ప్రేక్షకులకు స్వల్ప ఊరట కలిగింది. వినియోగదారులు తమకు ఇష్టమైన ఛానళ్లను ఎంచుకునేందుకు మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ టెలికం రెగ్యులేటరీ అథార్టీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ విధానం గతేడాది డిసెంబర్‌ 29న అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎంఎస్ వోలు, కేబుల్‌ ఆపరేటర్ల విజ్ఞప్తితో ఈ గడువును తొలుత జనవరి 31 వరకు పొడిగించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే, చాలామంది వినియోగదారులు నూతన విధానంలోకి మారకపోవడంతో వారికి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో ట్రాయ్ మరోసారి సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించింది. అనంతరం వినియోగదారులు తమకు ఇష్టమైన ఛానళ్లను ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తానికి మించకుండా, వారు కోరుకున్న చానళ్లను అందించేలా ప్యాకేజీలు రూపొందించాలని ఆపరేటర్లకు సూచించింది.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article