నేడు రుణమాఫీపై ట్రయల్ రన్

137
Trail Run on Rythu Runa Mafi
Trail Run on Rythu Runa Mafi

రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్. నేటి నుండి ఈ నెల 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ.
రైతు బంధు మాదిరిగా కుంట నుండి ఎకరా వరకు, ఎకరా నుండి 2 ఎకరాలు, 2 నుండి 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు జమ చేసిన మాదిరిగా రూ.25 వేలు, రూ.26 వేలు, రూ.27 వేలు చొప్పున రుణమాఫీ రైతుల ఖాతాలలో జమచేసే విధంగా చర్యలు. రైతుబంధు తరహాలో వందశాతం విజయవంతంగా పంట రుణమాఫీ ఆన్ లైన్ ద్వారా అమలుచేసేందుకు నేడు ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు. కేసీఆర్ నాయకత్వంలో 2014 నుండి 2018 వరకు రూ16,144.10 కోట్ల రైతుల రుణాలు మాఫీ. 2018లో రూ.25 వేల లోపు 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ. ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర రైతాంగం పక్షాన ధన్యవాదాలు. సమైక్య పాలనలో నిర్లక్ష్యం చేయబడ్డ వ్యవసాయ రంగానికి ఆసరాగా నిలిచారు. ఆకలితో తండ్లాడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా నిలిపారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషిచేస్తాం.
రేపటి నుండి రుణమాఫీ మొదలుకానున్న నేపథ్యంలో రైతులోకానికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here