పట్టాలు అంటించి.. రైలు పంపించారు

TRAIN TRACKS SET ON FIRE

పట్టాలపై మంటలున్నా రైలు వెళ్లిపోతోందేంటా అనుకుంటున్నారా? ఆ రైలుకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారా? అలా మంటలు వేయకుంటేనే ఆ రైలుకు ప్రమాదం జరుగుతుంది. అర్థం కాలేదా? ఇది చదివేయండి మరి. ప్రస్తుతం విపరీతమైన శీతలగాలులు, హిమపాతం కారణంగా అమెరికా గడ్డకట్టుకునిపోయింది. రైలు పట్టాలపై కూడా మంచు పేరుకుపోతోంది. దీంతో రైలు పట్టాల్లో అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. వాటి పైనుంచి రైలు వెళితే ప్రమాదం తప్పదు. ఈ నేపథ్యంలో వాటిని సరిచేయడానికి షికాగోలోని రైల్వే అధికారులు ఈ ఉపాయం కనిపెట్టారు. తొలుత ఓ తాడును కిరోసిన్ లో ముంచి దానిని రైలు పట్టాలపై పెట్టారు. అనంతరం దానిని అంటించారు. దీంతో వచ్చే వేడి కారణంగా పట్టాలు వేడెక్కి వ్యాకోచం చెంది, పగుళ్లు పూడుకుంటున్నాయి. వెంటనే వాటిని రైల్వే సిబ్బంది సరిచేసి, రైలును పంపిస్తున్నారు. ఐడియా బావుంది కదూ? వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. (అమెరికా వణికిపోతోంది)

INTERNATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article