రాఫెల్ డీల్ పై ఇంట్రెస్టింగ్ చర్చ

Trending topic on rafal deal

లోక్‌సభలో రాఫెల్ కుంభ కోణం పై ఆసక్తికర చర్చ జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన కౌంటర్ కు నిర్మలా సీతా రామన్ ఎన్ కౌంటర్ ఇచ్చారు. లోక్ సభలో నిర్మలా సీతారామన్‌‌ అపరకాళికా అవతారమెత్తారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్‌ గాంధీ కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చారు. అసలు రాహుల్‌ ప్రశ్నలేంటి…నిర్మలా సీతారామన్‌ వాటికిచ్చిన ఆన్సర్లేంటి…ఈ ప్రశ్నలకు సమాధానాలు సూటిగా ఉన్నాయా…మరిన్ని ప్రశ్నలకు ఆస్కారమిస్తున్నాయా? మోడీ హయాంలో అతిపెద్ద కుంభకోణాల్లో రాఫెల్ ‌ఒకటంటున్న కాంగ్రెస్ ఆరోపణలకు, లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ఆన్సర్లేంటి? రాఫెల్‌ డీల్‌పై ఈ ప్రశ్నలను కొంతకాలం నుంచి బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు రాహుల్‌ గాంధీ. మొన్న లోక్‌సభలోనే ఇవే క్వశ్చన్స్ వేశారు. అరుణ్‌ జైట్లీ సమాధానమిచ్చారు. కానీ రక్షణమంత్రి మాత్రమే ఆన్సర్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకే లోక్‌సభలో రాఫెల్‌ డీల్‌పై ఓ రేంజ్‌లో సమాధానమిచ్చారు డిఫెన్స్ ‌మినిస్టర్‌ నిర్మలా సీతారామన్. దసో-హాల్‌ మధ్య ఎందుకు ఒప్పందం కుదరలేదో కూడా వివరంగా చెప్పారు నిర్మలా సీతారామన్. హాల్‌తో ఒప్పందం విషయంలో దసోకు నమ్మకం కుదరలేదని క్లియర్‌గా చెప్పారు. అసలు 126 నుంచి 36 విమానాలకు మా ప్రభుత్వం తగ్గించలేదని ఆన్సరిచ్చారు నిర్మల. యూపీఏ నిర్ణయించిన 18 విమానాల సంఖ్యను మా 36కి పెంచిందని చెప్పారు. రాహుల్‌ సంధించిన మరో ప్రశ్న, ఒక్కో రాఫెల్‌ విమానం ధర మొదట రూ.526 కోట్లు. కానీ ఆమాంతం రూ.1670 కోట్లకు ఎందుకు పెంచారని. పెంచిన వ్యయం కేవలం అనిల్‌ అంబానీకి లబ్ది చేకూర్చేందుకేనన్నది ఆరోపణ. ఇందుకు నిర్మల కౌంటర్ ఏంటంటే, ఎన్డీయే బేస్‌ ప్రైజ్ 670 కోట్లు, కానీ యూపీఏ బేస్ ప్రైజ్ 737 కోట్లు. ఆ విధంగా రేటును మరింత తగ్గించామని నిర్మల చెప్పారు. రాఫెల్ విమానాలను కొనాలన్న ఉద్దేశం యూపీఏకి లేనేలేదుని, కేవలం తీర్మానాలకే పరిమితమైందని ఎదురుదాడి చేశారు. దేశ రక్షణ కాంగ్రెస్‌‌కు అవసరం లేదని, కేవలం వారిఖజానానే వారికి ముఖ్మమని కౌంటర్ ఇచ్చారు. ిఇలా ఏకధాటిగా రాఫెల్‌ డీల్‌పై సమాధానమిచ్చారు నిర్మలా సీతారామన్. అయితే నిర్మల ప్రసంగం మొత్తంలో, ఎక్కడా తమ ప్రశ్నలకు సమాధానం రాలేదని రాహుల్‌ గాంధీ అన్నారు. రాఫెల్‌ విమానాల ధర రహస్యంగా ఉంచే విషయమేమి కాదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చెప్పారని అన్నారు. నిర్మలా సీతారామన్‌ను లేదా పారికర్‌ను తాము నిందితులుగా చూపించడం లేదని, ప్రధాని మోడీ ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అన్నారు రాహుల్. తమ ముఖ్యమైన ప్రశ్న, అంబానీకి కాంట్రాక్ట్‌ ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? రాఫెల్‌ వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు రాహుల్. రాహుల్‌ ప్రశ్నలకు మరోసారి సమాధానమిచ్చారు నిర్మలా సీతారామన్. దసో కమర్షియల్‌ నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. ఎవరిని ఆఫ్‌సెట్‌ పార్టనర్‌గా ఎంచుకోవాలన్నదే దసో ఇష్టమన్నారు. ఇలా రాఫెల్‌ డీల్‌పై ప్రశ్నలు, సమాధానాలతో అట్టుడికిపోయింది లోక్‌సభ. నిర్మలా సీతారామన్ సూటిగా, సుత్తిలేకుండా, భావోద్వేగంతో ప్రసంగించినా, రాహుల్‌ చెప్పినట్టు కొన్ని ప్రశ్నలకు నేరుగా సమాధానమివ్వలేదు. భారత రక్షణ రంగానికి ఎన్నో విమానాల అందించిన, అపార అనుభవమున్న హాల్‌ను తక్కువ చేసి మాట్లాడారు. సత్తాలేదన్నారు. అలాగని కేవలం పేపర్‌ మీదే కనపడుతున్న, ఉనికిలోనే లేని అనిల్‌ డిఫెన్స్ కంపెనీకి సత్తా ఎలా ఉందో చెప్పలేకపోయారు. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీలో లేని ప్రతిభ, అనిల్‌ కంపెనీలో ఎలా ఉందో చెప్పలేదు. హాల్‌ పట్ల దసో కంపెనీ అనుమానానలను నివృత్తి ఎందుకు చేయలేకపోయారో వివరించలేదు. ధరలెందుకు పెరిగాయో వివరించలేకపోయారు. ఇలా కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు నిర్మలా సీతారామన్. అదే మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలకు బలమిస్తోంది. రాఫెల్‌ డీల్‌ మే కుచ్‌ కాలా హై అన్న క్వశ్చన్స్‌ మరింతగా రైజ్ చేసేలా నిర్మల ప్రసంగముందని విశ్లేషకుల అభిప్రాయం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article