తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దారుణ హత్య

trinamool congress MLA was Killed

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన నదియా జిల్లాలో శనివారం జరిగింది. శనివారం సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై బులెట్ల వర్షం కురిపించారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఈ హత్య వెనుక పలువురు హస్తముందని, ముకుల్‌రాయ్‌ అనుచరులే బిశ్వాస్‌ ను చంపారని జిల్లా టీఎంసీ అధ్యక్షుడు గౌరీశంకర్‌ ఆరోపించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ లోని ఫ్యాక్షనే ఈ హత్యకు కారణమని బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ పేర్కొన్నారు.ఈ ఘటనతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article