త్వరలో శింభు, త్రిష పెళ్లి?

176
Trish will marry Shimbhu
Trish will marry Shimbhu

Trish will marry Shimbhu

తెలుగు, తమిళ్ స్టార్ హీరోయిన్ త్రిష. కుర్ర హీరోలతోపాటు పెద్ద హీరోలతోనూ వర్క్ చేసింది. ముప్పై దాటుతున్నా చెరగని అందంతో ఆకట్టుకుంటోంది త్రిష. కొన్నాళ్లు రేసులో వెనుకబడిన తర్వాత 96, పేట సినిమాలతో విజయాలను అందుకుంది. మరిన్ని సినిమాలు త్రిష చేతిలో ఉన్నాయి. అయితే త్రిషకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ్ నటుడు శింభును పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో సూపర్ హిట్ అయిన మూవీ ఏమాయ చేశావే సినిమా తమిళంలోనూ హిట్ అయింది. ఇక్కడ నాగచైతన్య, సమంత చేస్తే, అక్కడ శింభు, త్రిష చేశారు. అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డట్లు వార్తాలు కూడా వచ్చాయి. ఇదే విషయం గురించి తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేసింది జంట. అయితే ఇటీవల శింబు ఈ ఏడాది డిసెంబర్‌లో శుభవార్త చెబుతానంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. ఆ శుభవార్త ఇదేనని అభిమానులు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here