చేసే సినిమాలతో ఎంత పాపులర్ అవుతుంటుందో… నో చెప్పే ప్రాజెక్టులతోనూ అంతే హైలెట్ అవుతుంటుంది సాయిపల్లవి. మంచి నటిగా గుర్తింపు పొందిన ఆమె… నచ్చని కథలకి నిర్మొహమాటంగా నో చెబుతూ ఉంటుంది. అవతల ఎంత పెద్ద స్టార్ అయినా… ఆ ప్రాజెక్ట్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బొస్తుందన్నా సాయిపల్లవి లెక్క చేయదు. నా మాటే శాసనం అని
నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంటుంది. తెలుగులో చిరంజీవి సినిమా మొదలుకొని ఆమె వద్దనుకున్న సినిమాలెన్నెన్నో. తాజాగా అలాంటి మరో రిజెక్షన్‌తోనూ ఆమె పేరు మరోసారి గట్టిగా వినిపిస్తోంది. ఆ
వివరాల్లోకి వెళితే… తమిళంలో స్టార్ హీరో విజయ్‌తో కలిసి నటించే అవకాశం సాయిపల్లవికి వచ్చిందట. కానీ ఆమె నో చెప్పిందట. ఇదేఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. తమిళనాట విజయ్ అంటే… మామూలు వ్యవహారం కాదు.
తెలుగులో పవన్‌కల్యాణ్‌కి ఎంత క్రేజో, తమిళంలో విజయ్‌కి అంత క్రేజ్. విజయ్ హీరోగా ఇటీవలే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో `లియో` మొదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మొదట హీరోయిన్‌గా సాయిపల్లవిని అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పిందట.దాంతో ఆ ప్రాజెక్ట్ త్రిష దగ్గరికి వెళ్లిందని సమాచారం. మాస్టర్ తర్వాత విజయ్ – లోకేశ్ కలిసి చేస్తున్న సినిమా లియో. ఈ సినిమాకి మామూలు క్రేజ్ లేదు. ఇలాంటి సినిమా అవకాశాన్ని ఏ కథానాయిక కూడా వద్దనుకోదు. కానీ సాయిపల్లవి నో చెప్పిందట. కారణమేమిటో ఆమెకే తెలియాలి. ఈ పరిణామం వల్ల త్రిష మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే అని తమిళ సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.