ఎన్టీఆర్ సినిమాలోనూ సునిల్…

Trivikram Picks Sunil in NTR Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయింది. హారిక హాసిని బ్యానర్ లోనే ఉండబోతోన్న ఈసినిమాలో పొలిటికల్ యాంగిల్ కూడా టచ్ చేస్తాడు త్రివిక్రమ్ అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన అరవింద సమేత అంతగా ఆకట్టుకోలేదనేది నిజం. కాంబినేషన్ క్రేజ్ వల్ల కమర్షియల్ గా లాస్ కాలేదు కానీ.. ఆ మూవీ ఎన్టీఆర్ అభిమానులను కూడా అలరించలేదు అనేది నిజం. కంప్లీట్ సీరియస్ మోడ్ లో సాగిన ఈ కథ తర్వాత ఈ సారి ఎన్టీఆర్ తో కాస్త జోష్ ఫుల్ మూవీ చేస్తాడు అనుకుంటే మళ్లీ పొలిటికల్ సబ్జెక్ట్ అని వినిపిస్తుండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

ఇక మరో విశేషం ఏంటంటే.. ఒకప్పుడు ఏదైనా సినిమా అనుకుంటే ముందుగా రాజబాబు, రమాప్రభ పేరు రాసుకుని ఆ తర్వాతే హీరోను అనుకునేవారట. అలా త్రివిక్రమ్ కూడా ముందుగా సునిల్ పేరు రాసుకుని ఆ తర్వాతే ఇతర స్టార్స్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తన ఫ్రెండ్ కు రీ లైఫ్ ఇవ్వడానికి త్రివిక్రమ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. సునిల్ హీరోగా విరమించుకున్న తర్వాత త్రివిక్రమ్ చేస్తోన్న ప్రతి సినిమాలోనూ ఆఫర్ ఇస్తున్నాడు. బట్ కాలం కలిసి రావడం లేదు. అయినా పట్టువదలకుండా ఫ్రెండ్ ను మరోసారి ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో చూపించబోతున్నాడట.
గతంలో అరవింద సమేతలో కూడా సునిల్ఉన్నాడు. కానీ అతన్ని కమెడియన్ అనాలా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా తేల్చుకోలేని పాత్ర అది. మొత్తంగా సునిల్ కోసం త్రివిక్రమ్ పడుతోన్న తాపత్రయం చూస్తోంటే ఓ మంచి ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది కదూ.

Trivikram Picks Sunil For NTR Movie,#JrNTR,#Trivikram,#Sunil,Sunil In Trivikram NTR Next Movie

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article