టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్.. PART 05

రామచంద్రభారతి: సంతోష్ ఇప్పుడు అమిత్ షాతోనే ఉన్నాడు. వాళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు. తుషార్ వేరే చోట ఉన్నాడు. ఆయన నంబర్ బిజీ వస్తోంది. అదలా ఉంచితే, పేమెంట్ కు ఎలాంటి సమస్య లేదు. పేమెంట్స్ కు సంబంధించి వాళ్లు ఒప్పుకున్నారు.
రామచంద్రభారతి: ఆయన (నందు) కూడా వాళ్లతో మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారు. ఎలాంటి సమస్య లేదు. నా దగ్గరికి ఇవాళే మీ ముగ్గురి పేర్లు వచ్చాయి.
గువ్వల బాలరాజు: నిజానికి మేం మునుగోడులో ఉన్నాం.
రామచంద్రభారతి: పేర్లు కూడా పంపొద్దని రోహిత్ తో అన్నాను. డైరెక్టుగా నా ముందు కూర్చున్నప్పుడు మాట్లాడుతానని చెప్పా. ఒకవేళ ఆయన పంపినప్పుడు అది ఇంటలిజెన్స్ కు వెళ్తే ప్రాబ్లమ్ రావొచ్చు. దాంతో మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. మీరు ఇబ్బంది పడొద్దనే నా ఉద్దేశం.
రామచంద్రభారతి: ఒకరోజు అటు ఇటు కావొచ్చు. కానీ ఎలాంటి సమస్య రావొద్దు. ఇదే కరెక్ట్ కదా! ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు ఫ్రీ అవుతారు. కాన్ఫరెన్స్ లోకి తీసుకుందాం.
నందు: ఇప్పుడు 6.15 అవుతోంది కదా.
రామచంద్రభారతి: 5.45కే ఆయన స్పీచ్ అయిపోయింది.
రోహిత్ రెడ్డి: స్వామీజీ. ప్రాసెస్ ఏంటని వాళ్లు నన్ను అడుగుతున్నారు. స్వామీజీనే ప్రాసెస్ ఏంటనేది మీకు నేరుగా చెప్తారు.
రామచంద్రభారతి: ఏం చూడకముందే ఎవరూ సిద్ధంగా ఉండరు. అది మీరైనా, వాళ్లయినా! వాళ్లకు కూడా కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఎందుకంటే, ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? అనే సమస్యలున్నాయి. నేను కేవలం వ్యక్తిని మాత్రమే.
రేగా కాంతారావు: మీరు పర్సన్ కాదు. పవర్!
రామచంద్రభారతి: తుషార్ లైన్లో ఉండండి. ఇక్కడ రోహిత్ రెడ్డి ఉన్నారు. వాళ్లు నాతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులను బట్టి వాళ్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు.
రామచంద్రభారతి: కాసేపు ఆగండి. రోహిత్ రెడ్డికి ఫోన్ ఇస్తున్నా. ఆయన టీఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్. ఆయన ఇప్పుడు నా ముందే ఉన్నారు. మరో ముగ్గురితో కలిసి ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి ఒకే చోట కూర్చున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఫైనాన్షియల్ గా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు.
రామచంద్రభారతి: స్థానిక కారణాల వల్ల వాళ్లు కూడా తొందర పెడుతున్నారు. స్థానికంగా వాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రోహిత్ రెడ్డికి ఫోన్ ఇస్తున్నా ఆగండి.
రోహిత్ రెడ్డి: తుషార్ గారు ఎలా ఉన్నారు?
తుషార్ (ఫోన్ లో): నడ్డా, అమిత్ షాతో మాట్లాడాను. రేపటి నుంచి మీరు ఎప్పుడు వచ్చినా.. మేం రెడీగా ఉన్నాం. సరైన తేదీ చెప్పమని సంతోష్ ను అడిగాను. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నారా?
రోహిత్ రెడ్డి: నిజానికి మేం ఫ్రీగా లేము. అందరం మునుగోడు ఎన్నికలో బిజీగా ఉన్నాం.
తుషార్ (ఫోన్ లో): ఆ ఎలక్షన్ మూడో తేదీ కదా?
రోహిత్ రెడ్డి: అవును. మూడో తేదీనే.
తుషార్ (ఫోన్ లో): మూడో తేదీ ఎన్నిక అయ్యాక 4 లేదా 5వ తేదీ టైం తీసుకుంటా. మీకు ఏది సరైందో చెప్తారా?
రోహిత్ రెడ్డి: మేం ఇవాళ లేదా రేపు ఫినిష్ చేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళే పూర్తి చేద్దామని స్వామీజీ చెప్పారు. అందుకే మేం ఇవాళ మిగిలిన ముగ్గురిని కూడా మునుగోడు నుంచి ఇక్కడికి పిలిపించాను. నిన్నటి నుంచి వాళ్లు ఇక్కడే ఉన్నారు. వాళ్లు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు.
తుషార్ (ఫోన్ లో): మనం సంతోష్ ని కలవాల్సి ఉంటుంది. మీ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదనే నేను ఇంకా ఆయనకు ఫోన్ చేయలేదు. నేను రేపు లేదా ఎల్లుండి ఆయన అపాయింట్ మెంట్ తీసుకుంటా. వీలైనంత త్వరగా అపాయింట్ మెంట్ తీసుకునే పనిలో ఉంటా. దానికంటే ముందు మనం కలుద్దాం. ఆ తర్వాత మనం వెళ్లి ఆయన్ని కలుద్దాం.
రోహిత్ రెడ్డి: తుషార్ జీ ఇవాళ రాత్రికి మీరు కూడా హైదరాబాద్ రాగలరా? ఎందుకంటే, ప్రతీ రోజు మాకు చాలా కీలకం. మేం చాలా రిస్క్ చేస్తున్నాం. మేం తీసుకుంటున్న రిస్క్ అంతా ఇంతా కాదు. అది చాలా ప్రమాదకరమైనది.
తుషార్ (ఫోన్ లో): నేను రావడం అనేది సమస్య కాదు. దీనికంటే ముందు నడ్డాజీతో మాట్లాడాలి. ఆయనతో ఫైనల్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నేను నిర్ణయం తీసుకోగలుగుతాను.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article