ఇక్కడ కారు జోరు.. అక్కడ ఫ్యాను హోరు

TRS AND YSRCP WILL SWEEP LS POLLS

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ జయభేరి మోగించనున్నాయని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 17 స్థానాలకుగానూ అధికార టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుందని, ఒక సీటు ఎంఐఎం ఖాతాలోకి వెళుతుందని వెల్లడైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైఎస్సార్‌ సీపీకి 19 సీట్లు, టీడీపీకి ఆరు సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది.

ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్‌సీపీదే పైచేయిగా ఉంది. ఆ పార్టీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. ఇండియాటుడే నిర్వహించిన సర్వే కూడా దేశంలో హంగ్ ఏర్పడుతుందని నిర్ధారించింది. ఎన్డీఏ మేజిక్ ఫిగర్ కి 35 సీట్ల దూరంలో ఆగిపోతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు కీలకం అవుతాయని వివరించింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ సర్వే ఫలితాలను విశ్లేషిస్తే, రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలు కీలకం కానున్నాయని తెలుస్తోంది. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలు కలిసి 35 సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మద్దతు ఎవరికి ఉంటే వారే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article