కవితకు క్యాబినెట్ దక్కేనా?

35
TRS Ex Mp Kavitha will get state cabinate?
TRS Ex Mp Kavitha will get state cabinate?

TRS Ex Mp Kavitha will get state cabinate?

ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్రవారం జరిగిన పోలింగ్ ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. పోలింగ్ టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయని తెలుస్తోంది. ఇక కవిత గెలుపు లాంఛనమే. ఈనెల 12న జరిగే ఓట్ల లెక్కింపుతో ఎంత మెజార్టీ రానుందో తెలియనుంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక 2014 నుంచి నిజమాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే అప్పట్నుంచి జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ కు జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తీసుకొచ్చేందుకు శ్రమించారు. అయితే 2019 ఎన్నికల్లో కవిత ఎంపీ అరవింద్ చేతిలో ఓడిపోయారు. దాంతో జాతీయ, రాష్ర్ట రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత రాష్ర్ట కాబినెట్ లో తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే రాష్ర్ట కాబినెట్ పూర్తిస్థాయిలో కొలువుదీరింది. ఇప్పుడు కవితను క్యాబినెట్ లో చోటు దక్కాలంటే ఎవరో ఒకరిపై వేటు పడాల్సిందే. లేదా ఎవరి చేతనైనా రాజీనామానైనా చేయించాలి. ఇందుకోసం ఎవరు బలవుతారో అని టీఆర్ఎస్ శ్రేణులు భయపడుతున్నాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే.. కేటీఆర్ సీఎం పదవి అధిష్టిస్తారు. అప్పుడు కవిత పార్టీ బాధ్యతలలు, క్యాబినెట్ కీలక పోస్టు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here