టీఆర్ఎస్ ఘర్ వాపసీ షురూ

TRS GHAR WAPSI OPERATION IN TELANGANA

* కమలం పరేషాన్
* మునుగోడు కేంద్రంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
* ప్రత్యక్షంగా రంగంలో దిగిన సీఎం కేసీఆర్
* భేరసారాలలో కేటీఆర్
* నిన్న బిక్షమయ్య గౌడ్
* నేడు శ్రావణ్, స్వామి గౌడ్
* మరి రేపు ఎవరు?
* జితేందర్ రెడ్డి, తుల ఉమా పై టీఆర్ఎస్ గురి
వరుస ఎదురు దెబ్బలతో కంగుతిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఘార్ వాపస్ ఆపరేషన్లను మొదలు పెట్టింది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా చకచకా పావులు కదుపుతున్నది. మునుగోడు ఎన్నికల్లో పరాభవాన్ని తప్పించుకోవడానికి అనూహ్యామైన రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నది. బీజేపీ ఒక ఎత్తు వేస్తే.. టీఆర్ఎస్ నాలుగు ఎత్తులతో రాజకీయ చదరంగం ఆడుతుంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ ముగ్గురు బడా నాయకులను లాగి ప్రతీకారం తీర్చుకుంది. నిన్నటి వరకు సీఎం కేసీఆర్ ను ఘాటుగా విమర్శించిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్.. బీజేపీలో చేరిన దాసోజు శ్రావణ్.. టీఆర్ఎస్ శిబిరంలో చేరడంతో కమలం పార్టీలో ఒక్కసారిగా కలవరం పుట్టించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అండ్ టీం షాకుకు గురయ్యారు. సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్న కాషాయ దళానికి.. కేసీఆర్ సిసలైన రాజకీయాలెలా ఉంటాయో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు.
దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీలో జరిగిన పరాభవం మునుగోడులో రిపీట్ కాకుండా సీఎం కేసీఆర్.. కీలక మంత్రి కేటీఆర్ ప్రత్యక్షంగా రంగంలో దిగారు. సీఎం కేసీఆర్ ఏకంగా తానే మునుగోడులో ప్రచారం కోసం క్యాంపు వేస్తానని తన అధికార పత్రిక.. నమస్తే తెలంగాణ ద్వారా ప్రత్యక్షంగా వెల్లడించడం మునుగోడులో పోటీ తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలో కమలం శిబిరంలో కల్లోలం రేపడం ద్వారా బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి సీఎం ఊహకు అందని రీతిలో ఎత్తులు వేస్తున్నారు. బీజేపీలో బడా నాయకులకు, ప్రత్యేకించి మునుగోడులో ఎక్కువ సంఖ్యలో ఉన్న గౌడ వర్గానికి చెందిన నాయకులను తమ పార్టీలోకి తిప్పుకోవడానికి సర్వశక్తులు ధారపోస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లె రవికుమార్ గౌడ్ ను తెరాసలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీలో జాతీయ రాజకీయాలపై మంతనాలు జరిపిన ఏ పార్టీ నుంచి మద్దతు రాకపోవడంతో ఫ్రస్టేషన్లో ముఖ్యమంత్రి అడ్డదిడ్డంగా మిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని, డర్జీ మనీ గేమ్ పాలిటిక్స్ ఆడుతున్నారని బీజేపీ మండిపడుతోంది. ఢిల్లీలో పరాభవానికి గురైన సీఎం.. మునుగోడులో ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో.. నీచ రాజకీయాల పాల్పడుతున్నారని బీజేపీ విమర్శలు ఎక్కు పెడుతుంది. అయితే, ఇవన్నీ ప్రజలు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే, బీజేపీ కేవలం అధికార పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలో ఉన్నాం కదా అని కేంద్ర ఏజెన్సీలతో దాడుల్ని నిర్వహిస్తూ.. టీఆర్ఎస్ శ్రేణుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి తమ ముందు కాషాయ పప్పులు ఉడకవని గులాబీ దళం ధీటైన జవాబునిస్తోంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article