నిజామాబాద్ అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ హవా…

TRS Grand Victory In Nizamabad

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పోరేషన్ తో పాటు 6 మున్సిపాలిటిల్లో మేయర్ మరియు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను  టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది . నిజామాబాద్ కార్పోరేషన్ లో మెజారిటి రాకపోయినా ఎంఐఎం, కాంగ్రేస్ సభ్యుల సహకారంతో మేయర్ పదవిని దక్కించుకుంది. ఆర్మూర్, కామారెడ్డీ, బోధన్ మున్సిపాలిటిల్లో చైర్మన్ పదవులు ముందుగా ప్రచారంలో వారు కాకుండా అనూహ్యంగా కొత వారికి దక్కాయి.  నిజామాబాద్ కార్పోరేషన్  మేయర్ గా దండు నీతూ కిరణ్ (11డివిజన్) ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎంకి చెందిన ఎండీ ఇద్రిస్ ఖాన్ (14డివిజన్) అయ్యారు. ఆర్మూర్ చైర్ పర్సన్ గా పండిత్ వినిత, వైస్ చైర్మన్ గా మున్ను భాయ్ ఎన్నికయ్యారు.బోధన్ చైర్ పర్సన్ గా తూము పద్మ, వైస్ చైర్మన్ సోయేల్ ఎన్నికయ్యారు.భీంగల్ చైర్ పర్సన్ గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్ గా భగత్ ఎన్నికయ్యారు.కామారెడ్డి చైర్ పర్సన్ గా కుమారి జాహ్నవి, వైస్ చైర్మన్ గా ఇందు ప్రియ ఎన్నికయ్యాడు.ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా  కుడుముల సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ గా ముస్త్యాల సుజాత ఎన్నికయ్యారు.  బాన్సువాడ చైర్మన్ గా జంగం గంగాధర్, వైస్ చైర్మన్ గా జుబేర్ ఎన్నికయ్యారు.ఒక్క నిజామాబాద్ కార్పోరేషన్ లో డిప్యూటి మేయర్ పదవి మాత్రమే ఎంఐఎంకి దక్కింది. నిజామాబాద్ మేయర్ పదవితో పాటు, మిగితా మున్సిపాలిటిల్లో చైర్నన్, వైస్ చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ పార్టికే దక్కాయి.

TRS Grand Victory In Nizamabad,municipal chairman, trs party, nizamabad , bjp, congress, MIM , Bodhan , bansuwada , nizamabad corporation , armur, kamareddy , bheemgal

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article