టీఆర్ఎస్ తెలంగాణా గల్లీ గల్లీలో ఉంది

114
TRS In Telangana Every Places Says Harish Rao
TRS In Telangana Every Places Says Harish Rao

TRS In Telangana Every Places Says Harish Rao

తెలంగాణా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోనూ దూసుకుపోతుంది. తెలంగాణా రాష్ట్రంలో అన్ని చోట్లా విజయం సాధించి భారీ మెజార్టీతో సత్తా చాటాలని గులాబీ బాస్ పార్టీ నేతలకు సూచించారు. గెలిపించాల్సిన బాధ్యత మంత్రులు,ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ తేల్చి చెప్పారు.ఇక ఈ నేపధ్యంలో గులాబీ పార్టీ జోరుగా ప్రచారం సాగిస్తుంది. సోషల్ మీడియాను సైతం విపతీరంగా వాడుకుంటుంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్‌ రావు.. విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని.. తమ అభ్యర్థులకు మెజారిటీ పరంగానే పోటీ వుందని తెలిపారు.  అన్ని పార్టీల అధిష్టానాలు ఢిల్లీలో వుంటే.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం తెలంగాణ గల్లీలో వుందన్నారు మంత్రి హరీష్‌ రావు. టీఆర్ఎస్‌ పార్టీకి ప్రజలే ప్రధానమని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ తోనే సాధ్యమని అన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

TRS In Telangana Every Places Says Harish Rao,telangana, trs party, municipal elections, minister harish rao, medak district , narsapur municipality

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here