లోక్ సభ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ దే హవా

TRS is going to win in  Loksabha Election … వీడీపీ అసోసియేట్స్ సర్వేవెల్లడి

రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రతిపక్షాలకు చేదు అనుభవాన్నే మిగల్చనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహా ఫలితాలు రిపీట్ కానున్నాయి. మళ్ళీ గులాబీ పార్టీ కే పట్టం కట్టనున్నాయి. ప్రజలు గులాబీ నేతనే నెత్తిన పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు … ఈ మాట చెప్తుంది మేము కాదు తెలంగాణా లో రానున్న ఎన్నికలు ఏ విధంగా వుంటాయి అని సర్వేలు జరిపిన సంస్థలు.
తెలంగాణలో ముందస్తు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఊహించని ఘన విజయం దక్కింది . కారు రయ్యిన దూసుకు పోయింది. ప్రత్యర్ధి పార్టీలను మట్టి కరిపించింది. ఇక ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా ఓట్లు మాత్రం టీఆర్ఎస్ కే వేశారు. ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఇక సర్వేల హడావిడి అంతా ఇంతా కాదు. ప్రజా కూటమి గెలుస్తుంది చాలా సర్వేలు తమ విశ్లేషణలను ఇచ్చినా ఫలితం మాత్రం గులాబీ పార్టీ కి అనుకూలంగా వచ్చింది. కనీసం సంకీర్ణం కూడా కాకుండా చాలా భారీ మెజార్టీ ఇచ్చి కేసీఆర్ కు పట్టం కట్టారు తెలంగాణా ప్రజలు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయ ఢంకా మొగించటానికి సిద్ధం అవుతుంది టీఆర్ ఎస్ పార్టీ . అందుకోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది . ఇక తెలంగాణా లోని 17 లోక్ సభ స్థానాలకు గానూ 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే బాగా పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యాలని తపన ఆ పార్టీ లో కనిపిస్తుంది. ఓటమి బాధతో కాంగ్రెస్ ఇంకా కోలుకోలేనిస్థితి ఉంటె టీఆర్ఎస్ మాత్రం సమయం వృధా చెయ్యకుండా దూకుడు చూపిస్తుంది.
ఇక ఇప్పటి కే పార్లమెంట్ ఎన్నికలపై ప్రీ పోల్ సర్వేలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినసర్వేలు కూడా గులాబీ పార్టీ కి అనుకూలమగా వచ్చాయి. తాజాగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 44.4 శాతం ఓట్లు రాబడుతోందని వీడీపీ అసోషియేట్స్ సర్వే సంస్థ తెలిపింది. తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఎలా వుంటుంది అని నిర్వహించిన సర్వేలో మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఒక్క సీటు కూడా రాదనీ తేల్చింది. 16 లోక్‌సభ స్థానాలలో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు వీడీపీ తెలిపింది. మిగిలిన ఒక్క స్థానాన్ని మిత్రపక్షం అయిన ఎంఐఎం గెలుచుకోనున్నట్టు తెలిపింది.
ఇక ఇప్పటికే నిరాశలో ఉన్న మిగతా పార్టీల నాయకులకు తన సర్వేతో మరో షాక్ ఇచ్చింది వీడీపీ అసోషియేట్స్ సర్వే సంస్థ. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేవని , కనీసం ఖాతా తెరిచే అవకాశం లేదని సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ 31 శాతం, బీజేపీ 11.4 శాతం, ఎంఐఎం 4 శాతం, టీడీపీ 3 శాతం, సీపీఎం 0.5 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్లు వీడీపీ అసోసియేట్స్ స్పష్టం చేసింది. 4 శాతం మంది ఓటర్లు నోటాకు ఓటు వేయనున్నట్లు తేల్చిన సర్వేతో కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్ నేతలు ఈసారి మళ్ళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇలాంటి సర్వేలు సైతం వారిని మరింత టెన్షన్ పెడుతున్నాయి. టీఆర్ ఎస్ కు జోష్ ఇస్తున్నాయి. ఇక ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు కచ్చితంగా టీఆర్ ఎస్ కు వస్తాయన్న ధీమాలో ఉన్న కేటీఆర్ అభ్యర్ధులను కూడా ప్రకటిస్తూ పోతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article