టీఆర్ఎస్ కు షాకిచ్చి కాంగ్రెస్ లో చేరి ఆపై…

197
TRS Leader Darga Dayakar Joins Congress
TRS Leader Darga Dayakar Joins Congress
TRS Leader Darga Dayakar Joins Congress
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల వేళ  నేడు  శుక్రవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు ఆశావహులు పోటీ పడ్డారు. ఇక ఈ నేపధ్యంలో టీఆర్ ఎస్ నుండి రెబల్స్ ఎవరైనా రంగంలోకి దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పిన నేపధ్యంలో  నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  టీఆర్ఎస్ లో బీఫాంలు దక్కని చాలా మందిని కాంగ్రెస్ బీజేపీలు తమవైపుకు తిప్పుకొని మరీ బీఫాంలు ఇచ్చి తమ పార్టీ తరుఫున పోటీ చేయిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు లోని  ఫిర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం యుద్దం నడించింది. టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఫోకస్ అయిన టికెట్ ఆశించి భంగపడ్డ దర్గా దయాకర్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరారు . టీఆర్ఎస్ టికెట్ ఆయనకు దక్కక పోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంటనే దయాకర్ రెడ్డి ఇంటికెళ్లి మరీ కలిసి అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మేయర్ పదవికి హామీ ఇచ్చి టికెట్ ఇచ్చేశారు. బీఫాం కూడా అందజేశారు.
అయితే ఈ విషయం తెలిసిన మంత్రి మల్లారెడ్డి అలెర్ట్ అయ్యి దయాకర్ రెడ్డి ఇంటికెళ్లి మరీ ఆయనను  వెంటపెట్టుకొని వెళ్లి తీసుకెళ్లిపోయారు. దయాకర్ రెడ్డి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ లో మంత్రి మల్లా రెడ్డి గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ బీఫాం అందుకున్న దయాకర్ రెడ్డి అనంతరం మల్లారె డ్డి వచ్చి తీసుకెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో ఫీర్జాదిగూడలో టెన్షన్ నెలకొంది. దయాకర్ రెడ్డి ఏ పార్టీ తరుఫున బరిలోకి దిగుతాడు అన్నది  ఆసక్తిగా మారింది.
TRS Leader Darga Dayakar Joins Congress,Municipal elections, trs party, nominations, cm kcr, firjadiguda, minister malla reddy, revanth reddy , congress, dayakar reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here