రిజిస్ట్రేష‌న్ల స‌మ‌స్య‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అసంతృప్తి

74

రాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్ల స‌మ‌స్య‌ల‌పై స్వ‌యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా.. కేటీఆర్‌కి విన్న‌వించినా..ప‌రిష్కారం కావ‌డం లేద‌న్నారు. జీరో అవ‌ర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రిజిస్టేషన్ల సమస్యతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నార‌ని చెప్పారు. ఆయ‌న ఇంకేమ‌న్నారంటే..

నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి గతంలో తెచ్చాము. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే సీఎం పరిష్కరిస్తాం అని అన్నారు. నా ప్రాంతాల్లో రిజిస్టేషన్ల సమస్య వల్ల ఇబ్బంది అవుతున్నారు. హుడా అనుమతి ఇచ్చింది- కాలనీలు వెలిచాయి. ప్రభుత్వ అనుమతులు అన్ని 1980లో ఇచ్చి- 96లో అకస్మాత్తుగా ఓఆర్సీ రద్దు చేశారు. 2008లో రిజిస్ట్రేషన్స్- భవన నిర్మాణ అనుమతులు బంద్ చేశారు. లే అవుట్ చేసుకున్న తరువాత ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు అవుతున్నారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఎమ్మెల్యేలతో మీటింగ్ లను కొనసాగించాలి. రిజిస్టేషన్ల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here