నిజామాబాద్ కు పట్టిన దరిద్రం

  • పచ్చి అబద్దాలకోరు
  • డ్రగ్ ఆడిక్ట్ అండ్ సైకో
  • జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నా
  • ఈ ఘటన తో నాకెలాంటి సంబంధం లేదు
  • నిందితులను పట్టుకోవాలని పోలీసు అధికారులకు చెప్పా
  • జర్నలిస్టులు బిజెపి ట్రాప్ లో పడొద్దు

“నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒక బట్టేబాజ్, బక్వాస్, బడా జూటా ఎంపీ. అరవింద్ పుట్టిన తర్వాత అబద్ధం పుట్టింది. లైఫ్ టైమ్ లయ్యర్ ఎంపీ. నిజామాబాద్ కు పట్టిన దరిద్రం. పచ్చి అబద్దాలకోరు. డ్రగ్ ఆడిక్ట్ అండ్ సైకో .అరవింద్ ది నేర చరిత్ర. ఆయన కుటుంబానిది ఘోర చరిత్ర. డీ ఎస్ అంటే డాడీ సన్ డ్రామా. మాక్లూర్ మండలంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటన తో నాకెలాంటి సంబంధం లేదు. నిందితులను పట్టుకోవాలని పోలీసు అధికారులకు చెప్పా. వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. అరవింద్ , బీజేపీ మూక చిల్లర రాజకీయాలు చేస్తూ నామీద బురద చల్లే కుట్ర చేసిండ్రు. జర్నలిస్టులు బిజెపి ట్రాప్ లో పడొద్దు” అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యేఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా గత 5 రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న జీవన్ రెడ్డి రెండు రోజులుగా అరవింద్, బీజేపీ నాయకులు కొందరు తనపై చేస్తున్న దుష్ప్రచారం పై మంగళవారం ఫేస్ బుక్ లైవ్ లో వివరణ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లానని, 15వ తేదీ రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నానని ఆయన చెప్పారు.తాను లేని సమయంలో, తనకెలాంటి సంబంధం లేకుండా జరిగిన జర్నలిస్ట్ పై దాడి ఘటనను తనకు ఆపాదించ డాని కి అరవింద్ కుట్ర చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. 20ఏండ్లు గా ఉద్యమం లో, రాజకీయాలలో జర్నలిస్టుల తో కలిసి పని చేస్తున్నానని, ఫ్రెండ్లీ జర్నలిస్టు ఎమ్మెల్యే నని,ఇప్పటికీ 3వేల టీవీ చర్చల్లో పాల్గొన్నానని, ప్రతి రోజు టీవీ చర్చల్లో,ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో ఉంటానని, అలాంటి తాను ఒక జర్నలిస్టుపై ఎందుకు దాడి చేస్తానని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో జర్నలిస్ట్ పై తుపాకి ఎక్కుపెట్టి దాడి చేసిన చరిత్ర అరవింద్ కే ఉందని, నేర చరితుడని, అనేక కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా దుబాయ్ పోలేడని, పోతే కేసులు పెడతారని అరవింద్ తప్పుడు ప్రచారం చేశారని, తాను దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి లైవ్ లో సవాల్ చేస్తే అరవింద్ తోక ముడిచాడని ఆయన పేర్కొంటూ అప్పటి నుంచి ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ -ఎఫ్-3ఎంపీ అన్నామని, అయినా వ్యక్తిత్వం మార్చుకోకుండా బరి తెగించి అబద్దాలు చెపుతున్న అరవింద్ ను బట్టేబాజ్, బాక్వాస్, బడా జూటా -బీ-3 ఎంపీ అంటున్నామని తెలిపారు. తండ్రీ కొడుకులు తలో పార్టీలో ఉన్నారని, ఒకే ఇంట్లో మూడు కుంపట్లు అని ఆయన ఎద్దేవా చేశారు. అరవింద్ ముందు నీ ఇల్లు చక్కబెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడాలన్నారు. వర్ధంతి కి జయంతి కి తేడా తెలియని ఈ అబద్దాలకోరును, పసుపు బోర్డు తేకుండా పంగనామాలు పెట్టిన ఈ లంగ, లఫంగా ఎంపీని నిజామాబాద్ జిల్లా ప్రజలు నమ్మరన్నారు. తనకు కరోనా తగ్గినాక దాడికి గురైన జర్నలిస్టును కలిసి పరామర్శిస్తానని జీవన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article