కవితకు గెలుపు సవాల్

48
Ministers Shocked On Nayani's Demise
Ministers Shocked On Nayani's Demise

TRS Operation Akarsh for Kalvakuntla kavitha

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. ఉప ఎన్నికలలో కల్వకుంట కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో గెలుపు సవాల్ గా మారింది. పార్టీ నాయకులు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కవితను ఎలాగైనా గెలిపించాలని స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి కవితను గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు కోసం మెజార్టీ తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి కవిత ఓటమి చెందింది. ఆ సమయంలో కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికను నేతలు సవాలుగా తీసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీకి ఉన్న ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు, మరికొందరు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కవిత.. మరి ఇసారైనా గెలుస్తుందా లేదా అని చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here