హవ్వా.. సభలో టీఆర్ఎస్ ఎంత పని చేసింది?

104
Trs Passed Municipal Bill In A Backdoor
Trs Passed Municipal Bill In A Backdoor

Trs Passed Municipal Bill In A Backdoor

హవ్వా.. టీఆర్ఎస్ పార్టీ ఎంత పని చేసింది? తెలంగాణ అసెంబ్లీలో శనివారం టీఆర్ఎస్ పార్టీ దొంగ చాటుగా మున్సిపల్ బిల్లుపై ఆమోదముద్ర వేయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత అధికార పార్టీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తాము సభలో లేని సమయం చూసి, బయట విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి వెళ్లినప్పుడు మున్సిపల్ బిల్లుపై ఆమోదముద్ర వేశారని టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా పాస్ చేయడం దారుణమైన విషయమన్నారు. సభలో లేని సమయాన్ని చూసి ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. ప్రతి రోజు ఏయే అంశాలపై సభలో ప్రవేశపెడతాము? దేనిపై చర్చ జరుగుతుందనే విషయాన్ని ముందే సభ్యులకు తెలియజేశామని, అదే రీతిలో ఈ రోజున కూడా కాంగ్రెస్ సభ్యులకూ సమాచారం పంపామన్నారు. కానీ, ఆ విషయం తెలుసుకోకుండా అనవసర ఆరోపణలు చేయడం కరెక్టు కాదని తెలిపారు. తెలంగాణ శాసన సభ వ్యవహారాలను చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ మిలాఖత్ అయిపోయిందనే అనుమానాలు సాధారణ ప్రజానీకానికి వస్తుంది. ఎందుకంటే, కీలకమైన మున్సిపల్ బిల్లు వస్తుందని తెలిసి కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ నుంచి ఎలా బయటికి వెళ్లిపోతారని అనుకుంటున్నారు. ఒకవేళ, నిజంగానే వెళ్లాలనుకుంటే తర్వాత అయినా వెళ్లొచ్చు కదా.. అప్పుడే, ప్రెస్ మీట్ పెట్టాల్సిన పనేముందని అసెంబ్లీ లైవ్ ని చూసే ప్రజలు అనుకుంటున్నారు. అయితే, ఇదంతా కేటీఆర్, శ్రీధర్ బాబు, భట్టిలు కలిసి ఆడిన డ్రామా అని కూడా ప్రజలు భావిస్తున్నారు.

Trs Assembly Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here