కారు జోరు…తెలంగాణ భవన్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు…

105
TRS set to clean sweep municipal elections
TRS set to clean sweep municipal elections

TRS set to clean sweep municipal elections

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్లు లెక్కింపు కోసం అధికారులు 2,619 టేబుళ్లను ఏర్పాటు చేశారు.  మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ జోరు చూపిస్తోంది. కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల కౌంటింగ్‌ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఫలితాల అనంతరం సంబరాలు జరపడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 37 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసింది . 120 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో అధికార కారు పార్టీ విజయం సాధించింది.  మిగతా 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది . ప్రతిపక్ష కాంగ్రెస్‌ను చిత్తుచేస్తూ.. పూర్తి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక మొత్తం 9 మున్సిపల్ కార్పోరేషన్ లలో 5 కార్పోరేషన్ లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.
దీంతో తెలంగాణ భవన్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినా ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఫలితాల అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మొత్తానికి కారు జోరుతో సందడి నెలకొంది.

TRS set to clean sweep municipal elections,Telangana ,  municipal elections, political parties ,  councilors, ward members , counting, kcr,ktr , trs party, telangana bhavan, celebrations,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here