టీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డి ?

TRS Next target is revanth reddy

రేవంత్ రెడ్డి… తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను ధీటుగా ఎదుర్కొంటానని సవాల్ విసిరిన నేత. తొడగొట్టి మీసం మెలేసి టిఆర్ఎస్ పార్టీని పాతాళంలో తొక్కుతా అని చెప్పిన నేత. అలాంటి రేవంత్ రెడ్డి ని ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ఆయన నోటి వెంట మాట రాకుండా చేసారు గులాబీ బాస్. టిడిపిలో ఉన్న నాటి నుండి కాంగ్రెస్లో మారిన నేటి వరకు కేసీఆర్ ను ఓడించడానికి రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. కెసిఆర్ వేసిన ఎత్తుగడలను ఎన్నోసార్లు వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి చివరకు కొడంగల్ ఎన్నికల్లో కెసిఆర్ అపర చాణక్య ముందు నిలవలేకపోయారు.

ఇక రేవంత్ రెడ్డి కోవలోనే కేసీఆర్ పై గెలవాలనే లక్ష్యంలో 10 సంవత్సరాల నుంచి గజిని మెహమ్మద్ లా పోరాటం చేశారు వంటేరు ప్రతాపరెడ్డి. చివరకు తనవల్ల కాదని చేతులెత్తేసిన వంటేరు.. ఇప్పుడు సైలెంట్ గా కారెక్కారు. మరోవైపు.. తమకు వ్యతిరేకంగా బలమైన లీడర్ తెలంగాణలో ఉండూకూదనే భావనతో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ కళ్లు.. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై పడ్డాయి.రేవంత్ రెడ్డి చాలా గట్టి కేండిడేట్. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లీడర్లకంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో ఎప్పటికైనా టీఆర్ ఎస్ పార్టీకి మేకులా మారే వ్యక్తి రేవంత్. అలాంటి రేవంత్ ని ఇప్పుడు పార్టీలో పార్టీలో చేర్చుకుని లూప్లైన్ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించిందట టీఆర్ ఎస్. అందులో బాగంగా.. ఎమ్మెల్సీ ఇచ్చి సైలెంట్ గా సైడ్ చేయాలని చూస్తోందట. అయితే… భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అబ్యర్థిగా ఉన్న రేవంత్… కేవలం ఎమ్మెల్సీ పదవికి ఆశపడి టీఆర్ ఎస్ లోకి వెళ్లే అవకాశమే లేదు. కానీ ఎలాగైనా సరే.. రేవంత్ ని తమ పార్టీలో చేర్చుకోవాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉంది టీఆర్ ఎస్. నిన్నటి వరకు కెసిఆర్ మీద పోరాడిన రేవంత్ రెడ్డి టి ఆర్ ఎస్ లో చేరి కెసిఆర్ కు జై కొడతారా. తన ఆత్మాభిమానాన్ని చంపుకొని శత్రువు శిబిరంలో చేరతారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకపక్క ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుంది అవకాశాలున్న నేపథ్యం ఉంది. ఇక ఇదే సమయంలో గులాబీ బాస్ రేవంత్ రెడ్డి కి బంపర్ ఆఫర్ ఇస్తే వాటికి తలొగ్గి రేవంత్ టిఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనేది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article