వరంగల్ లో 9 స్థానాల్లో టీఆర్ఎస్  చైర్మన్ లు

136
TRS wins Nine municipalities in erstwhile Warangal,
TRS wins Nine municipalities in erstwhile Warangal,

TRS wins Nine municipalities in erstwhile Warangal

మున్సిపల్‌ ఎన్నికలలో  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9మున్సిపాలిటీల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది….9చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ ఛైర్మన్ ల వివరాలు చూస్తే వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల మున్సిపల్ చైర్మన్ గా సోదా అనిత, వైస్ చైర్మన్ గా రేగురి జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు.వరంగల్ రూరల్ జిల్లాలోని  వర్ధన్నపేట నూతన మున్సిపాలిటికి  ఛైర్ పర్సన్ గా  అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నిక జరిగింది. ఇక  నర్సంపేట మున్సిపల్  చైర్మన్ గా గుంటి రజని కిషన్, వైస్ చైర్మన్ గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నికయ్యారు.  మహబూబాద్ మున్సిపల్ చైర్మన్ గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మహ్మద్ ఫరిద్ ఎన్నిక జరిగింది.
మహబూబాద్ జిల్లాలో  మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సిందూర, వైస్ చైర్మన్ గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నికయ్యారు . మహబూబాద్ జిల్లాలో  డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మెన్ గా వంకుడొతు.వీరన్న, వైస్ చైర్మన్ గా కేసబోయిన.కోటి లింగం ఎన్నికయ్యారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్  మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నిక జరిగింది.  భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ గా  సెగం వెంకట రాణి, వైస్ చైర్మన్ గా కొత్త హరిబాబు ఎన్నికయ్యారు. జనగామ జిల్లా:జనగామ మున్సిపాలిటీ  చైర్మెన్ గా పోకల జమున, వైస్ చైర్మన్ గా మేకల రాం ప్రసాద్ ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here