మచ్చాకు టీఆర్ఎస్ ఇచ్చిన మెగా ఆఫర్

Trs Mega Offer to Macha Nageswarao… డైలమాలో మచ్చా

2014 ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన అభ్యర్థులను టిఆర్ఎస్ లో చేర్చుకొని టిడిపి ఉనికే ప్రశ్నార్థకం చేసిన గులాబీ బాస్ 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా టిడిపిని టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ పార్టీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకురావడానికి గులాబీ బాస్ వారికి బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మొన్నటివరకు సండ్ర వెంకటవీరయ్య కు మాత్రమే మంత్రి పదవి అని ఆఫర్ చేసిన గులాబీ పార్టీ ఇప్పుడు మచ్చ నాగేశ్వరరావుకు కూడా మెగా ఆఫర్ ఇచ్చారు.

మొన్నటి వరకు సండ్ర వెంకటవీరయ్య కు మంత్రి పదవి ఇస్తామని చెప్పిన కేసీఆర్ మచ్చా నాగేశ్వరావు ని కూడా తీసుకురావాలని షరతు విధించారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ని కలిసిన మచ్చా నాగేశ్వరరావు టీడీపీ ని వదిలి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రి పదవి ఇచ్చినప్పటికీ టిడిపిని వదలనని ఆయన ప్రకటన చేశారు. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తే నాగేశ్వరరావు కూడా పార్టీని మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు తో మచ్చా నాగేశ్వరరావు భేటీ కావడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. ఇక మచ్చా కు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో టిఆర్ఎస్ ను గద్దె దించటం కోసం ప్రజాకూటమి పొత్తులో భాగంగా టిడిపి పోటీ చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఘోరంగా పరాజయంa పాలయింది. టిడిపి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు ఇద్దరు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకో గలిగింది. ఖమ్మం జిల్లా నుండి సండ్ర వెంకటవీరయ్య , మచ్చా నాగేశ్వరావు లు మాత్రమే విజయం సాధించారు. వీరిద్దరినీ కార్యం చేస్తే టిడిపి పూర్తిగా తెలంగాణలో ఖాళీ అవుతుంది. అసెంబ్లీలో ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించే ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు అని భావించిన కేసీఆర్ వీరిరువురికి ఎర వేశారు. మచ్చా ని తీసుకుని పార్టీలో చేరితే సెంటర్ కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సండ్ర కార్ ఎక్కడానికి సిద్ధమయ్యాడు. కానీ మచ్చా మాత్రం తాను రానని తేల్చి చెప్పాడు. ఇక ఎలాగైనా మచ్చా కూడా పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్న కెసిఆర్ ఆ పనిని తుమ్మలకు అప్పగించారు. ఒకపక్క పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మచ్చా తుమ్మల తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తుమ్మల టిఆర్ఎస్ లో చేరాలని అలా చేరితే ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో మచ్చా పునరాలోచనలో పడ్డారట. ఇక ఆయన కార్ ఎక్కాలి అని నిర్ణయం తీసుకుంటే సండ్ర కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి కెసిఆర్ వ్యూహం ఫలించినట్టే

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article