రూ.2.30 లక్షల కోట్లతో తెలంగాణ పద్దు

కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా తెలంగాణ ప్రభుత్వం భారీగానే బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2021-22 ఏడాదికి సంబంధించి రూ.2,30,825.96 కోట్లతో బడ్జెట్ తీసుకొచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆర్థికమంత్రి హరీశ్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2,30,825.96 కోట్లలో రెవెన్యూ వ్యయం రూ.1,69383.44 కోట్లు కాగా ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు. పెట్టుబడి వ్యయం 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6743.50 కోట్లు. ఇక జీఎస్ డీపీ అంచనా రూ.9,78373 కోట్లుగా పేర్కొన్నారు.

బడ్జెట్ లో ఈసారి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్ లో దాదాపు రూ.25వేల కోట్లు కేటాయించింది. రైతుబంధుకు రూ.14,8 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.5,225 కోట్లు, రైతు బీమాకు రూ.1200 కోట్లు కేటాయించింది. కాగా, అంతకుముందు హరీశ్ రావు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article