ఎన్నికల కమిషనర్‌కు కరోనా

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కరోనా సోకింది. ఇటీవల ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి, అందులో పాల్గొన్న అధికారులందరూ కరోనా పరీక్షల్ని చేసుకున్నారా?

126
ELECTION COMMISSIONER PARTHASARATI GOT COVID POSITIVE
ELECTION COMMISSIONER PARTHASARATI GOT COVID POSITIVE

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కరోనా బారిన పడ్డారు. ఈసీ పార్థసారథి గురువారం కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. గతనెలలో నిమ్స్‌లో ఆయన కోవిడ్‌ టీకా తొలి డోసు కూడా వేసుకున్నారు. తొలి డోసు వేసుకున్న తర్వాత ఆయన కరోనా బారిన బారిన పడటం గమనార్హం. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతో కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల 909 కరోనా కేసులు రికార్డు కాగా..ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 వేల 791 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 487, మేడ్చల్ లో 289, నిజామాబాద్ జిల్లాలో 202 కరోనా కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here