ఇంటర్ పరీక్షలు రద్దు

76

కరోనా వల్ల విద్యారంగం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విధివిధానాలు రూపొందించి ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి సబితా ఇంద్రరెడ్డి తెలిపారు. ఫలితాల వెల్లడి కోసం కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదక అనంతరం ఫలితాల వెల్లడి పై క్లారిటీ ఇస్తామన్నారు. అయితే, అంతకంటే ముందు ఇంటర్ పరీక్షల రద్దు పై మంత్రి సబితా కీలక వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ఇంటర్ పరీక్షల రద్దు పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి కొంత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో, ఒక్కసారిగా ఇంటర్ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు వెల్లడవుతుందోనని విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి, తాజా ప్రకటనతో ఉత్కంఠరకు తెరపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here