డెవలపర్లు ఎందుకు బంద్ పాటిస్తున్నారు?

ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ.. టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజుకో ప్రకటనతో ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం సోమవారం బంద్ పాటిస్తామంటూ ప్రకటించాయి. ఇంతవరకూ ఏనాడూ నిర్మాణ సంఘాలు ఇలా బంద్ ప్రకటించలేదు. మరి, పార్టీతో నిత్యం సన్నిహితంగా ఉండే నిర్మాణ సంఘాలు ఎందుకు హఠాత్లుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి? 

తెలంగాణ నిర్మాణ రంగం ప్రస్తుతం రకరకాల వర్గాలుగా చీలిపోయింది. కొందరేమో అధికార పార్టీకి దగ్గరగా ఉంటే మరికొందరు బీజేపీకి చేరువయ్యారు. ఇంకొందరేమో కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈమధ్య నిర్మాణ రంగం ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నా అధికార పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు. అంతెందుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించమంటే సీఎస్ సోమేష్ కుమార్  అంగీకరించలేదు. నిర్మాణ సంఘాలు సమర్పించిన విన్నపాల్ని ఆయన బుట్టదాఖలు చేశారు. యూడీఎస్, ప్రీలాంచ్ స్కాముల్ని కూడా పరిష్కరించడంలో సోమేష్ విఫలమయ్యారని, ధరణి సమస్యకు మూలకారణం సోమేషే అంటూ నిర్మాణ సంఘాల్లో కొందరు డెవ‌ల‌ప‌ర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ధ‌ర‌ణిలో వాస్త‌విక స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోకుండా.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేయ‌డం వ‌ల్లే అధిక శాతం మంది ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. డెవలపర్లు ధరణి వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి నిర్మాణ సంఘాలకు పెద్దగా ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ధరణి వల్ల మాత్రం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అనూహ్యంగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా  ప‌రిష్కారం కాద‌ని డెవలపర్లకు అర్థమైంది. అందుకే, తెలంగాణ నిర్మాణ సంఘాల‌న్నీ క‌లిసి సోమ‌వారం 4న బంద్ పెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఏదో మొక్కుబడిగా, తూతుమంత్రంగా ఇది జరిగితే మాత్రం పెద్దగా ప్రభావం కనిపించదు. మ‌రి, ఈ నిర్ణయం ప‌ట్ల అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో..

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article