సోష‌ల్ మీడియాపై రెరా న‌జ‌ర్‌

TS RERA FOCUS ON SOCIAL MEDIA

* ఫేస్ బుక్‌, ఇన్ స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ ల‌పై ఫోక‌స్‌
* అనుమ‌తి లేకుండా అమ్మితే.. 10 శాతం జ‌రిమానా..

సోష‌ల్ మీడియాపై తెలంగాణ రెరా అథారిటీ న‌జ‌ర్ పెట్టింది. త‌మ అనుమ‌తి తీసుకోకుండా కొన్ని సంస్థ‌లు ఫేస్ బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ట్విట్వ‌ర్ల‌లో ప్రీ లాంచ్ ప‌థ‌కాల్ని ప్ర‌క‌టిస్తున్నాయ‌ని రెరా గుర్తించింది. ప్రీ లాంచ్‌, సాఫ్ట్ లాంచ్‌, యూడీఎస్ స్కీమ్, హండ్రెడ్ ప‌ర్సంట్, ఫిఫ్టీ ప‌ర్సంట్ పేమెంట్ అంటూ ప‌లు సంస్థ‌లు అందజేస్తోన్న ప్ర‌క‌ట‌న‌ల వివ‌రాల్ని సేక‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయా ప్ర‌క‌ట‌న‌ల్ని సేక‌రించాక‌.. అనుమ‌తి లేని సంస్థ‌ల‌కు షోకాజ్ నోటీసుల్ని జారీ చేయ‌డానికి స‌మాయ‌త్త‌మైంది. ఇటీవ‌ల ఒక సంస్థ‌కు తెలంగాణ రెరా అథారిటీ షోకాజ్ నోటీసును జారీ చేసింది. దీంతో ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు రెరా ముందుకొచ్చి.. త‌మ‌కు తెలియ‌కుండా.. త‌మ పేరును ఉప‌యోగించుకుని ఎవ‌రో విక్ర‌యాలు చేస్తున్నారంటూ వివ‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఆ త‌ర్వాత స‌ద‌రు సంస్థ పేప‌ర్ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

* త‌క్కువ ధ‌ర‌కు ప్లాటు లేదా ఫ్లాటు వ‌స్తుంద‌ని కొనుగోలుదారులు యూడీఎస్ ప‌థ‌కం కింద కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని రెరా అథారిటీ సూచిస్తోంది. ప్ర‌స్తుతం వంద శాతం సొమ్ము చెల్లిస్తున్నారు కాబ‌ట్టి.. మూడు లేదా నాలుగేళ్ల వ‌ర‌కూ క‌ట్టిన మొత్తం సొమ్ముపై వ‌డ్డీని లెక్కిస్తే మార్కెట్ రేటే వ‌స్తుంది. కాబ‌ట్టి, కొనుగోలుదారులు ఎట్టి ప‌రిస్థితులో త‌మ క‌ష్టార్జితాన్ని బూడిద‌పాలు చేసుకోకూడ‌దు. ఒక‌వేళ ఎవ‌రైనా యూడీఎస్ కింద అమ్ముతామంటూ ముందుకొస్తే వెంట‌నే రెరా అథారిటీకి సమాచారం ఇవ్వాలి. రెరా కింద న‌మోదైన ఏజెంట్లు కూడా కేవ‌లం రెరా నెంబ‌రు గ‌ల ప్రాజెక్టుల్లో మాత్ర‌మే ప్లాట్లు లేదా ఫ్లాట్ల‌ను విక్ర‌యించాలి. లేక‌పోతే, అత‌నిపై కూడా రెరా చ‌ర్య‌లు తీసుకుంటుంది.

* రేటు త‌క్కువ‌ని కొంద‌రు అమాయ‌క కొనుగోలుదారులు ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. కాక‌పోతే, రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. తెలంగాణ రెరా అథారిటీ అనుమ‌తి లేకుండా ఏ ఒక్క‌రూ ప్లాటు కానీ ఫ్లాటు కానీ విక్ర‌యించ‌కూడ‌దు. ప్ర‌ధానంగా 500 గ‌జాలు లేదా అంత‌కుమించిన స్థ‌లంలో ఎనిమిది కంటే ఎక్కువ ఫ్లాట్ల‌ను క‌ట్టే ప్ర‌తిఒక్క బిల్డ‌ర్ రెరా అనుమ‌తి తీసుకోవాల్సిందే. పైగా, రెరా నెంబ‌రు విధిగా ప్ర‌తి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొనాలి. కాక‌పోతే, ఈ రెండు నిబంధ‌న‌ల్ని గ‌త కొంత‌కాలం నుంచి అనేక రియ‌ల్ సంస్థ‌లు ప‌ట్టించుకోవడం లేదు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు యూడీఎస్ ప్ర‌క‌ట‌న‌ల్ని గుప్పిస్తున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం సొమ్మును జ‌రిమానాగా విధించ‌డానికి స‌మాయ‌త్తం అవుతోంది.

TS RERA FOCUS ON FACEBOOK

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article