ప్రేమ విఫలమై నటి ఆత్మహత్య

TV ACTRESS SUICIDE

  • బలవన్మరణానికి పాల్పడిన టీవీ నటి ఝాన్సీ

ప్రేమ విఫలం కావడంతో ఓ టీవీ నటి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతున్నాడనే కారణంతో ఝాన్సీ అనే బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శ్రీనగర్‌ కాలనీలో తన నివాసంలోనే  ఉరి వేసుకుని తనువు చాలించింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పడాలికి చెందిన ఝాన్సీ పంజగుట్టలో నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె మాటీవీ లో ప్రసారమవుతున్న పవిత్రబంధం అనే సీరియల్ లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సూర్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని ఝాన్సీ కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి ప్రేమలో పడిన ఆమె నటనకు కూడా దూరమైందని పేర్కొన్నారు. అయితే, గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, సీరియల్‌ అవకాశాలు కోల్పోయి.. మరోవైపు సూర్య మోసం చేయడంతో నాలుగు రోజులుగా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్‌ ఇంటికి వచ్చాక తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

CRIME NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article