బాయ్స్.. అదరగొట్టారు

Spread the love

TWEETS ON STRIKES

  • భారత వైమానిక దళానికి ప్రశంసల వెల్లువ
  • ట్వీట్లతో హోరెత్తిస్తున్న సెలబ్రిటీలు

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పై యావత్ భారతావని హర్షం వ్యక్తంచేస్తోంది. ఈ దాడుల్లో పాలుపంచుకున్న భారత వాయుసేన పైలట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు తమ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ‘అబ్బాయిలు ఆట అదరగొట్టారు’ అంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘బుల్లెట్ దిగిందా లేదా..’ అంటూ తన సినిమాలోని పాపులర్ డైలాగ్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు. ‘ఎవడు కొడితే ఉగ్ర శిబిరాలన్నీ బ్లాక్‌ అయిపోతాయో వాళ్లే మన సైనికులు’ అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ‘మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోడానికి మీకు శవాలు కూడా దొరకవు’ అని సినీ రచయిత కోన వెంకట్‌ పంచ్ విసిరారు. ‘చేతులు ముడుచుకుని కూర్చునే టైం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం’ అని కల్యాణ్‌రామ్‌ ట్వీట్ చేశారు. ‘మాతో పెట్టుకుంటే ఇలాగే చచ్చిపోతారు. సెల్యూట్‌’ అని అజయ్‌ దేవగణ్‌ పేర్కొన్నారు. మన వాయుసేన అదిరిపోయే రీతిలో పాక్ కు జావాబిచ్చిందని అందరూ కొనియాడుతున్నారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *