భానుప్రియ కేసులో ట్విస్ట్

Twist on Actress Banu Priya.. టెన్షన్ లో భానుప్రియ

మైనర్ బాలికను పనిలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేశారని.. భాను ప్రియ సోదరుడు లైంగికంగా వేధించాడని బాలక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సీనియర్ నటి భానుప్రియ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. .. బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని చోరీ కేసులో పాండీ బజార్ పోలీసులు అరెస్టు చేశారు.తూర్పుగోదావరిజిల్లా సామర్ల కోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భాను ప్రియ నివాసంలో పనికి పెట్టారు. అయితే.. గత సంవత్సరకాలంగా ఆ బాలికను ఇంటికి పంపడం లేదని.. లైంగికంగా వేధిస్తూ.. చిత్ర హింసలు పెడుతున్నారని,… కనీసం తల్లితో ఫోన్ లో కూడా మాట్లాడనివ్వడం లేదని బాలిక తల్లి భానుప్రియపై కేసు పెట్టింది.
ఈ ఘటనపై స్పందించిన భానుప్రియ.. బాలిక తమ ఇంట్లో చోరీకి పాల్పడిందని.. పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించడంతో ఐపాడ్, వాచ్, కెమేరా తిరి ఇచ్చారని.. డబ్బులు ఇంకా ఇవ్వలేదని ఈలోపు ఇలా కేసు పెట్టారని పేర్కొన్నారు. మరోవైపు మైనర్‌ అమ్మాయిని ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న వ్యవహారంలో భానుప్రియ, ఆమె సోదరుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. మైనర్‌ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. బాలకార్మిక చట్టం ప్రకారం ఇలా వ్యవహరించిన వారిపై రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్‌ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని భానుప్రియ చెబుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article