జనసేనకు ట్విట్టర్ షాక్

TWITTER SHOCK TO JANASENA

జనసేన పార్టీకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని సహా దాదాపు 300 వరకు ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. ఒక రాజకీయ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతాలు ఇలా బ్లాక్ కావడం దాదాపు అరుదే. అయితే, నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే తెలుగు ప్రభుత్వాలు తమ ట్విట్టర్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని మూయించేశాయని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ నియమ నిబంధనల్ని అతిక్రమించినా.. విపరీతమైన స్పామ్ పోస్టులు క్రియేట్ చేసినా.. ట్విట్టర్ అలాంటి ఖాతాలను సస్పెండ్ చేస్తుంది. అయితే, ఒక రాజకీయ పార్టీకి చెందిన ఖాతాలను ఇంత పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడం ట్విట్టర్ స్వయంగా తీసుకున్న నిర్ణయం అయి ఉండదని, దీని వెనుక కచ్చితంగా వైఎస్సార్ సీపీతోపాటు టీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా, ‘పావలా’ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ని వైఎస్సార్ సీపీ మద్దతుదారులు రూపొందించారు. దీంతో జనసైనికులు రెచ్చిపోయి, జగన్‌పై విపరీత కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తమ అధికారం ఉపయోగించి జనసేన ఖాతాలు స్తంభింపజేసి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *