అమరావతిలో మద్యం సేవించి ఇద్దరి మృతి

two amaravati men died after drinking poisonous liquor

ఒక పక్క రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోపక్క ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో విషాదం నెలకొంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పురుగుల మందు కలిపిన మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ ఘటన జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కుటుంబసభ్యులపై అలకబూనిన హరిబాబు అనే వ్యక్తి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు.  అయితే, అటుగా వెళుతూ హరిబాబు మద్యం తాగడాన్ని చూసిన వందనం అనే వ్యక్తి తనకు కూడా మద్యం కావాలని హరిబాబును అడిగాడు. అందులో పురుగుల మందు కలిపానని హరిబాబు ఎంత చెప్పినా వినని వందనం ఆ మద్యాన్ని తాను కూడా తాగాడు. ఈ ఘటనలో హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, వందనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

two amaravati men died after drinking poisonous liquor,capital amaravati, amaravati, tulluru , liquor, cool drink , money , two persons , died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *