అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాటి పైన మధ్యాహ్నం 2:20 సమయంలో ఎదురెదురుగా వస్తూ రెండు కార్లు ఢీ కొట్టుకున్నాయి.
అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
అయితే AP 09 BL 9136 అను నెంబర్ గల కారు కొయ్యూరు మండలంలోని రేవళ్ళ గ్రామానికి చెందినది అని తెలిపారు.
TS 25 E 2981 అను నెంబర్ గల కారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు.
ఘాటి పైనుంచి కిందికి వేగంగా దిగుతూ తమ కారును ఢీకొట్టారని తెలంగాణాకి చెందిన ములుగు నియోజకవర్గం, మంగపేట మండలం,కమలాపూర్ వాసులు అంటున్నారు.
తమ కారును ఢీకొని ఎటువంటి సమాధానం చెప్పకుండా కారుతోపాటు పరారయ్యారని తెలంగాణ వాసులు తెలిపారు.
అదే కారులో వచ్చిన కొంతమంది మాకు ఏఎస్పి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలుసు మాకేం జరగదు మీరే చూసుకోండి అని మమ్మల్ని భయపెడుతున్నారని వారు తెలిపారు.