రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు

122

తెలంగాణ‌లో రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ అధికారుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణశాఖ అప్ర‌మ‌త్త‌మైంది. జిల్లా యంత్రాంగాన్ని సంసిద్దంగా ఉంచాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఉత్త‌ర తెలంగాణ‌లో భారీవ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణశాఖ పేర్కొన్న‌ది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో వాయ‌వ్య బంగాళాఖాతం, ఒడిశా, బెంగాల్‌లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. రాగ‌ల 24 గం. ల్లో మ‌రింత బ‌ల‌ప‌డి ఒడిశా మీదుగా వెళ్లే అవ‌కాశం ఉంది. అల్ప‌పీడ‌న ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా ద్రోణి విస్త‌రించింది. అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో రాగ‌ల 4 రోజుల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒక‌ట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్న వాతావ‌ర‌ణశాఖ‌ ఉత్త‌ర‌, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా అతి భారీవ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here