ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తలపాడు సమీపంలోని మలుపువద్ద భద్రాచలం నుండి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలో మృతిచెందారు. అయితే ప్రమాద కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article