రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు

Two states elections are in same time.. కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్ కుమార్ లేఖ

తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విషయంలో తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖతో ఆయన ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.రానున్న సార్వత్రిక ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ కు అవకాశం ఉండదని ఆయన లేఖలో పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతున్నాయని అన్నారు.
ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయని.. ఈ ఎన్నికల తోపాటే ఏపీలో 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని.. అప్పుడప్పుడు తమ స్వస్థలాలకు వెళ్ళి వస్తుంటారని చెప్పారు. ఈ క్రమంలో వారు రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఒకే రోజు పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రలోభాలకు తావులేకుండా చేయడంతోపాటు డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివాటిని నివారించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ప్రతిపాదించారు

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article