ఒకరు కాదు ఇద్దర్ని పెళ్ళాడిన కిలాడీ

122
TWO WIVES ONE HUSBAND INDIAN
TWO WIVES ONE HUSBAND INDIAN

TWO WIVES ONE HUSBAND

మూడు ముళ్లు వేయించుకొని, ఏడడుగులు నడిచిన భర్తకు ద్రోహం చేసిందో అభినవసతి. కొలువు కోసమని చెప్పి, ఏంచక్కా రెండో మొగుడును చూసుకుంది. కాపురం కూడా పెట్టేయడం, ప్రవర్తనలో మార్పురావడంతో భర్త గమనించాడు. ఉద్యోగం వద్దు, ఇంటికి వెళ్ధామని వస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్య మరొకరిని పెళ్లి చేసుకుందని విషయం తెలిసి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సీతారామపురానికి చెందిన ప్రశాంత్.. రాధిక అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఐదేళ్ల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు వీరిని వెంటాడాయి. దీంతో ఆరునెలల క్రితం ఉద్యోగం చేస్తానని భర్తకు చెప్పి భాగ్యనగరానికి చేరింది రాధిక. చెప్పినట్టే ఉద్యోగం కూడా సంపాదించింది. ఎల్బీనగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. కొత్తపేట విజయపురి కాలనీలోని రాయల్ హాస్టల్‌లో ఉంటుంది. ఇంతవరకు ఒకే కానీ.. ఆమె భర్తకు దూరంగా ఉన్నానని ఫీల్ కలుగలేదు. ఇక్కడే శశికుమార్ అనే వ్యక్తితో స్నేహం ముదిరి ప్రేమ నుంచి పెళ్లికి దారితీసింది. వారిద్దరూ ఏంచక్కా పెళ్లి చేసుకున్నారు. ఏ భయం లేకుండా కాపురం కూడా చేస్తున్నారు. ఆమెకు తన భర్త, కుటుంబం ఉందనే బెంగ లేకుండా రెండో భర్తతో జాలీగా గడుపుతుంది.
అయితే తన భార్య రాధిక ప్రవర్తనలో మార్పును ప్రశాంత్ గమనించాడు. ఎప్పుడూ తనతో సరిగా మాట్లాడకపోవడం, దూరం పెట్టడంతో అనుమాన పడ్డాడు. ఆయన అనుకున్నట్టే జరిగింది. ఇక లాభం లేదని గత నెల 19న రాధిక సోదరుడిని వెంటపెట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. రాధిక ఉండే హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అయితే వారిని గమనించిన రాధిక .. తన బంఢారం ఎక్కడ బయటపడుతుందోనని మదనపడింది. హాస్టల్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. అదేంటి అని ఆరా తీస్తే .. అక్కడున్న వారు జరిగిన దానిని గురించి వివరించారు. శశికుమార్‌ను పెళ్లి కూడా చేసుకుందని చెప్పడంతో షాక్ తిన్నారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధికేనా ఇలా చేసింది అని ప్రశాంత్ మదనపడ్డాడు. తనను మోసం చేసిన రాధికపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు.దీంతో ప్రశాంత్ తన భార్య రాధిక, శశికుమార్‌పై ఫిర్యాదు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుందని పేర్కొన్నారు. తనను మోసం చేసిందని కంప్లైంట్ పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ..రాధిక, శశికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు శశికుమార్ ..ఉద్యోగం చేసే సమయంలో పరిచయమైనట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాధిక, శశికుమార్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

TWO WIVES ONE HUSBAND

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here