యూకే నుంచి ఎంతమంది వచ్చారు?

UK NEW CORONA VIRUS

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తున్నది. యూకే నుండి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది యూకే నుండి తెలంగాణకు వచ్చినట్లు గుర్తించారని, వారి వివరాలు సేకరిస్తున్నామని,  అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించింది. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. UK నుండి వచ్చిన వారికి  పరీక్షలు చేసిన వారిలో ఇప్పటి వరకు ఎవరికీ కరోనా పాజిటివ్గా నమోదు కాలేదు.

డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యూకే నుండి వచ్చిన వారు లేదా యూకే మీదుగా ప్రయాణించి  వచ్చిన వారు వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందించాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారు.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడం లో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగాము. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కొత్త రకం వైరస్ తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మాస్క్ తప్పని సరిగా వాడండి, భౌతిక దూరం పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *