UK VIRUS.. NEW STRATEGY
అందరూ కరోనా ముప్పు తప్పిందని అనుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఆఫీసులు ఆరంభమయ్యాయి. నెమ్మదిగా మార్కెట్ మళ్లీ కోలుకుంటోంది.
కేవలం సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు మాత్రమే ఇంకా తెరుచుకోలేదు. ప్రజలు పండుగలు జరుపుకుంటున్నారు. పెళ్లిళ్లు కూడా హ్యాపీహ్యాపీగా జరుగుతున్నాయి. మరి, కరోనా లేదనుకుంటున్న ప్రస్తుత తరుణంలో, ప్రజలు కరోనా వ్యాక్సీన్ ఎందుకు వేయించుకుంటారు చెప్పండి? అసలెంత మంది కరోనా వ్యాక్సీన్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఎక్కువ మంది పెద్దగా ఆసక్తి చూపెట్టే అవకాశమే లేదు.
వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది. కొత్తగా రూపాంతరం చెందింది. దీని వల్ల చిన్నారులు, పిల్లలు, పెద్దలు అప్రమత్తంగా ఉండాలని బెదిరిస్తే? యూకే, యూరప్, సౌదీ అరేబియాలో వైరస్ కొత్త రూపం సంతరించుకుందని భయపెడితే జనాలు తప్పకుండా కరోనా వ్యాక్సీన్ వేసుకుంటారని, అందుకే ఈ కొత్త వైరస్ డ్రామా అని చాలామంది భావిస్తున్నారు. కేవలం బ్రిటన్ లో డ్రగ్ మాఫియా కారణంగా ఇదంతా జరుగుతుందని వాదించే వారు లేకపోలేరు. ఇలా భయపెట్టకపోతే ప్రజలు వైరస్ కొనుగోలు చేయరని, అందుకే కొత్త డ్రామాకు తెరలేచిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదీఏమైనా, వచ్చే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మరింత సమాచారం మనందరికీ తెలుస్తుంది.